Uday Kiran: టాలీవుడ్ నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు అంటే అతనిపేరే చెప్పేవారు. లవర్ బాయ్ గా, పక్కింటి కుర్రాడిగా.. మిడిల్ క్లాస్ కొడుకుగా రియల్ లైఫ్ లో చూపించాలంటే.. ఉదయ్ కిరణ్ లా ఉండాలంటూ చెప్పుకొచ్చేవారు.