(ఆగస్టు 4న కిశోర్ కుమార్ జయంతి) గాయకునిగా కిశోర్ కుమార్ బాణీ విలక్షణమైనది. కిశోర్ గళం కిర్రెక్కించేది. ఆయన పాట పరవశింప చేసేది. నటన మత్తు చల్లింది. కిశోర్ పాటతోనే దేవానంద్, రాజేశ్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్స్ వెలిశారు. కిశోర్ గానంతోనే అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. కిశోర్ గాత్రంలోని వైచిత్రిని పట్టుకొని, దానినే సాధన చేస్తూ కొందరు తరువాతి తరం గాయకులూ జయకేతనం ఎగురవేశారు. ఒక్కసారి కిశోర్ గానంతో పరిచయమైతే చాలు…