టాలీవుడ్ లో రీరిలీజ్ సందడి జోరుగా సాగుతుంది. స్టార్ హీరోల ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు రీరిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేస్తున్నారు. ఇటీవల మహేశ్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సలార్ రీరిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ వంతు. బాలయ్య కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’. సుప్రసిద్ధ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు దర్శకతత్వంలో…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కె. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అంచనాలు వున్నాయి.ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షకుడిగా సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు పని చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడానికి కొన్ని సలహాలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది.. ప్రాజెక్ట్ కే సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ మరియు కమల్…
భారతీయ చిత్ర పరిశ్రమకు కొత్తదనాన్ని పరిచయం చేసిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఎన్నో గొప్ప చిత్రాలు తీశారాయన. అందులో తమిళ సినిమా ‘దిక్కట్ర పార్వతి’ ఒకటి. రాజాజీ జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రమిది. 1974లో విడుదలైంది. దీనికి ఫిల్మ్ ఫైనాన్స్ కార్పోరేషన్ స్పాన్సర్ చేయడం విశేషం. ఇప్పుడీ సినిమా ఓ అరుదైన ఘనత పొందింది. చెన్నైలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జనవరి 1వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ సినిమాను ప్రత్యేకంగా…
(సెప్టెంబర్ 21న సింగీతం శ్రీనివాసరావు పుట్టినరోజు) ప్రయోగాలు చేయడం గొప్పకాదు. వాటిని సఫలీకృతం చేసుకుంటేనే గొప్ప. చిత్రసీమలో సింగీతం శ్రీనివాసరావు పలు ప్రయోగాలు చేసి గొప్పగా నిలిచారు. వయసులో ఏముంది, మనసులోనే అంతా ఉందంటూ కాలంతో పరుగులు తీస్తున్న పడచువాడు సింగీతం. ఆయన ఆలోచనలన్నీ వర్తమానంలోనే భవిష్యత్ ను చూపిస్తూ ఉంటాయి. సింగీతం ఆలోచనల్లో 30 ఏళ్ళ క్రితం పురుడు పోసుకున్న ‘ఆదిత్య 369’ మన దేశంలో తొలి టైమ్ మిషన్ మూవీగా నిలవడమే కాదు, ఈ…
(జూలై 18న ‘ఆదిత్య 369’కు 30 ఏళ్ళు పూర్తి) నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో అనేక అద్భుత విజయాలు ఉన్నాయి. అయితే ఆయన కెరీర్ లోనే కాదు, యావత్ భారతీయ చిత్రసీమలోనే ఓ అపురూపం అనదగ్గ చిత్రం ‘ఆదిత్య 369’. మన దేశంలో తొలి టైమ్ మిషన్ మూవీగా ‘ఆదిత్య 369’ తెరకెక్కింది. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ అనే చిత్రం స్ఫూర్తితో ఈ సినిమా రూపొందినా, ఎక్కడా ఆ సినిమాను కాపీ కొట్టింది లేదు.…