తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మళ్ళీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ‘ఆదిత్య 369’, ‘పుష్పక విమానం’, ‘భైరవద్వీపం’ వంటి కళాఖండాలను అందించిన ఈ జీనియస్, తన 61వ చిత్రాన్ని (#SSR61) ప్రకటించారు. ఈ వయసులోనూ ఆయనకు ఉన్న సినిమా ప్యాషన్‌ను చూసి సినీ లోకం ఆశ్చర్యపోతోంది.
Also Read : #D55: ధనుష్ సరసన శ్రీలీల.. #D55 క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది!
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. విశేషం ఏంటంటే, ‘కల్కి 2898 AD’ దర్శకుడు నాగశ్విన్ ఈ సినిమాకు ప్రొడక్షన్ బాధ్యతలతో పాటు క్రియేటివ్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఇది సింగీతం శ్రీనివాసరావు కెరీర్‌లోనే మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ అని మేకర్స్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయబోతున్నారు. సైన్స్ ఫిక్షన్ లేదా టైం ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
A visionary. A master.
A genius ahead of time.The legendary Director #SingeetamSrinivasaRao garu returns with his most ambitious project yet.#SSR61 – Title Announcement Soon.https://t.co/SA22M5fcyx@nagashwin7 @ThisIsDSP @VyjayanthiFilms @SwapnaCinema pic.twitter.com/aX5Qi7X56i
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 31, 2026