సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏడాది చివరి నాటికి 300 మెగావాట్లకు చేరుకోనుంది. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్(ఎస్‌టీపీపీ) అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్‌సీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్.. మొదటి దశలో మిగిలిన 76 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను నవంబర్ నాటికి పూర్తి చేయాలని కోరారు. ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 మెగావాట్లకు చేరుకుంటుంది.