మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణిలో జరిగిన ప్రమాదంపై సింగరేణి సీఎండీ శ్రీధర్ స్పందించారు. ఎస్‌ఆర్‌పీ-3,3ఎ ఇంక్లైన్ ప్రమాదంలో కార్మికుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా తక్షణ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అండగా సింగరేణి ఉంటుందని, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబంలో అర్హులైన ఒకరికి కోరుకున్న ఏరియాలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గని ప్రమాద మృతులకు కంపెనీ…
చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు అయిన రాజు ఆచూకీ, సమాచారం కోసం పెట్టిన ఫోన్ నంబర్ లకు తలనొప్పి తెప్పించే విధంగా కాల్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నెల 13న రాజు ఆనవాలు ,ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల రివార్డ్ ఇస్తామని ప్రకటించారు పోలీసులు. అందుకు రెండు ఫోన్ నంబర్ లను పబ్లిష్ చేసి వాటికి సమాచారం అందించాల్సిందిగా విస్తృత ప్రచారం చేసారు. దీంతో ఏకంగా 5 వేలకు పైగా మంది ఆ నంబర్లకు ఫోన్…
చిన్నారి చైత్రకు ప్రభుత్వం, పోలీసులు చెయ్యలేని న్యాయం దేవుడు చేశాడని వైఎస్ఆర్.టి.పి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ అన్నారు. 6 ఏళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్యచేశాడు. కనీసం 7 రోజులు గడిచినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కారణం ఆ కుటుంబ పేదరికమేనని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ షర్మిళ మాట్లాడుతూ.. ‘మేము దీక్ష చేసిన తరువాతే ప్రభుత్వంలో చలనం వచ్చింది. శాంతియుతంగా మేము దీక్ష చేస్తుంటే రాత్రి 2 గంటలకు 200 మంది పోలీసులు మాపై దాడిచేశారు.…
సైదాబాద్ సింగరేణి కాలనీ ఘటనను సీరియస్‌గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజు కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.. ఘటన జరిగిన తర్వాత పరారైన రాజు కోసం జల్లెడ పడుతున్నారు పోలీసులు.. నిందితుడికి మద్యం అలవాటు ఉండడంతో.. అన్ని మద్యం షాపులు, కల్లు దుకాణాల వద్ద నిఘా కూడా పెట్టారు.. ఇక, ఈ నేపథ్యంలో.. అన్ని జిల్లాల ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి.. జిల్లాలోని అన్ని…
సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింగరేని కాలనీలో ఆరేళ్ల బాలికపై పాశవికంగా అత్యాచారం, హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.. నిందితుడిని పట్టుకోవడానికి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు.. ఇప్పటి వరకు నిందితుడి ఆచూకీ దొరకలేదు. ఆ చిన్నారి కుటుంబ సభ్యులను రాజకీయ నేతలు, ప్రజాసంఘాల నాయకులు, తాజాగా.. సినీ నటుడు మంచు మనోజ్ కూడా పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు.. నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.. ఇక, ఈ ఘటన…
హైదరాబాద్ నడిబొడ్డులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసు తీవ్ర కలకలం రేపింది.. అయితే, ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజును ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక అనుమానాస్పద రీతిలో మృతిచెందడంతో కలకలం రేగింది.. అయితే, బాలిక పక్కింట్లో నివసించే రాజు అనే వ్యక్తి ఇంట్లోనే మృతదేహమై కనిపించింది చిన్నారి.. దీంతో.. బాలిక తల్లిదండ్రులతో పాటు స్థానికులు ఆందోళనకు దిగారు.. నిందితుడు పరారీ కాగా.. వెంటనే…