ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 26 నుండి 30 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్, అధికారులతో కూడిన బృందం నాలుగు రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులతో పాటు, అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం, పోర్టులు, సాంకేతిక, మౌళిక రంగాల్లో సింగపూర్ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల సహకారం కోరనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
Srilanka Crisis- Gotabaya Rajapaksa: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు ఊరట లభించింది. మరో రెండు వారాల పాటు సింగపూర్ లో ఉండేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం గొటబాయ రాజపక్స సింగపూర్ లో టూరిస్ట్ వీసాపై నివాసం ఉంటున్నాడు. ఇటీవల శ్రీలంక క్యాబినెట్ అధికార ప్రతినిధి బంధుల గుణవర్థన మాట్లాడుతూ.. గొటబాయ రాజపక్స ఎన్నో రోజులు సింగపూర్ లో ఉండలేడని.. త్వరలోనే శ్రీలంకకు వస్తారని అన్నారు.