Pakistan: ఆర్థిక సంక్షోభం, అప్పులు, రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కి జాక్‌పాట్ తగిలింది. సింధునదిలో ‘‘బంగారు నిల్వలు’’ ఉన్నట్లు తేలింది. ప్రాచీన సింధు లోయ నాగరికతకు ఈ నది తల్లిగా ఉంది. అద్భుతమైన నాగరికత ఈ నదీ ఒడ్డునే వెలిసింది. మెహంజోదారో, హరప్పా వంటి గొప్ప నగరాలు ఈ నాగరికతలో వెలిశాయి. ఋగ్వేదంలో కూడా సింధు నదీ ప్రస్తావన ఉంది. క్రీస్తుపూర్వం 3300-1300 మధ్య హరప్పా నాగరికతకు కీలకంగా సింధునది ఉంది.
Pakistan floods death toll crosses 1,000, rainfall continues: దాయాది దేశం పాకిస్తాన్ వరదలతో వణుకుతోంది. భారీ వర్షాలు, వరదలు ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న పాకిస్తాన్ దేశం.. వరదల కారణంగా మరింత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ లోని సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సులు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో పాటు పంజాబ్, గిల్గిత్ బాల్టిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో కూడా వరద ప్రభావం ఉంది. జూన్ 14…