వర్షాలు కురిస్తే కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతుంటాయి. కొన్ని చోట్ల లంకెబిందెలు బయటపడుతుంటాయి. అయితే, మధ్యప్రదేశ్‌లో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు గుణ జిల్లాల్లోని సింధ్ నది పొంగిపోర్లింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నది శాంతించింది. వరద నీరు వెనక్కి వెళ్లిన తరువాత నదీ తీరంలో వెండినాణేలు బయటపడ్డాయి. అశోక్‌నగర్‌లోని పంచ్‌వాలిలోని నదీతీరంలో ఈ నాణేలు బయటపడ్డాయి. కొంతమందికి పాతకాలం నాటి నాణేలు దొరకడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకొని నాణేల…