Lal Darwaza Bonalu 2025 Rangam and Gavu Patta Today: లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి భక్తులు ఆదివారం బోనాలను సమర్పించారు. నిన్న ఘనంగా బోనాల సమర్పణ, అమ్మవారి శాంతి కళ్యాణం జరిగాయి. నేడు సింహవాహిని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నేడు మధ్యాహ్నం తరువాత పచ్చి కుండపై రంగం భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం పోతరాజుల గావు పట్టే కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం అమ్మవారి ఊరేగింపుతో పాటు ఘటాలు, పలహర బండ్ల ఊరేగింపు…
తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత వైభవంగా, ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే పాతబస్తీ లాల్ దర్వాజ మహాంకాళి బోనాల జాతర ఉత్సవాలు జులై 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సంవత్సరం 117వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.