Common Wealth Games 2022: ఇంగ్లండ్‌లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో తొలి పతకం చేరింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సంకేత్ సర్గార్‌కు సిల్వర్ పతకం లభించింది. శనివారం జరిగిన 55 కేజీల విభాగంలో సంకేత్ సర్గార్ రెండో స్థానంలో నిలిచాడు. 55 కిలోల విభాగంలో సంకేత్ 248 కిలోలు ఎత్తాడు. స్నాచ్‌లో 114 కిలోలు ఎత్తగా.. క్లీన్ అండ్ జర్క్‌లో 135 కిలోలు లిఫ్ట్ చేశాడు. దురదృష్టకరమైన అంశం ఏమిటంటే…
World Athletics Championship: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రోలో భారత స్టార్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అమెరికాలోని యూజీన్‌లో ఆదివారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. 46 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు ఇది రెండో పతకం మాత్రమే. గతంలో మహిళా అథ్లెట్ పతకం నెగ్గగా పురుషులలో మాత్రం ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్ నీరజ్ చోప్రానే కావడం…
ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా (24) తన రికార్డునే తానే బద్దలుకొట్టుకున్నాడు. ఫిన్‌లాండ్‌లో జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో 89.30 మీటర్ల దూరంలో జావెలిన్ త్రో వేసి రికార్డు సృష్టించాడు. దీంతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలుకొట్టుకున్నాడు. నీరజ్ చోప్రా గత ఏడాది మార్చిలో పాటియాలలో 88.07 మీటర్లు విసిరాడు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేశాడు. అంతేకాకుండా 2021, ఆగస్టు 7న టోక్యో ఒలింపిక్స్‌లో 87.58 మీటర్ల దూరం విసిరి బంగారు…
పారాలింపిక్స్ లో భారత్ కు వరుస పతకాలు వస్తున్న వస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఒక్క రోజే నాలుగు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు ఈ రోజు కూడా పతకాల వేటను ప్రారంభించారు. పారా బ్యాడ్మింటన్ ఇండియా ప్లేయర్ సుహాస్ యతిరాజ్ రజతం సాధించాడు. సెమిస్ లో అద్భుత ప్రదర్శన చేసి సుహాస్ ఫైనల్స్ కు చేరుకున్నాడు. అయితే ఫైనల్ లో దూకుడుగా వ్యవరించి మొదటి రౌండ్ ను సొంతం చేసుకున్న సుహాస్ ఆ తర్వాతి రెండు…
టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది… ఇవాళ భారత్ ఖాతాలో మరో పతకం చేరింది… టీ64 పురుషుల హై జంప్‌లో ప్రవీణ్ కుమార్ రజత పతకాన్ని సాధించాడు. 2.07 మీటర్ల జంప్‌తో ఈ పతకాన్ని సాధించాడు ప్రవీణ్ కుమార్.. ఇక, 18 ఏళ్లకే పతకాన్ని అందుకున్న ప్రవీణ్.. సరికొత్త ఆసియన్ రికార్డు నెలకొల్పాడు. తాజాగా పతకంతో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 11కు చేరింది.
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో రజత పతకం వచ్చి చేరింది. హైజంప్ లో అథ్లెట్ నిషాద్ కుమార్ ఈ పతకాన్ని సాధించారు. ఈ పతకం సాధించే సమయంలో 2.06 మీటర్లతో నిషాద్ కుమార్ ఆసియా గేమ్స్ రికార్డు ను బ్రేక్ చేసాడు. అయితే ఈ హైజంప్ లో యూఎస్ అథ్లెట్ 2.15 స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అయితే రజతం సాధించిన నిషాద్ కుమార్ కు ట్విట్టర్ వేదికగా ప్రధాని మొదటి శుభాకాంక్షలు తెలిపారు. అయితే…
పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్‌లో కొత్త రికార్డు నెలకొల్పారు భారత్ అథ్లెట్ భవీనా పటేల్.. తొలిసారి పారాలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌లో భారత్ ఒక్క పతకం సాధించకపోగా.. అనూహ్యంగా ఫైనల్‌లో అడుగుపెట్టిన భవీనా.. ఫైనల్‌లో ఓడినా.. ఇండియాకు తొలి పతకాన్ని అందించి చరిత్ర సృష్టించారు.. ఇక, భవీనా పటేల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.. భవీనా చరిత్ర లిఖించింది.. ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ అభినందలు తెలపగా.. పారాలింపిక్స్‌లో భవీనాబెన్ సాధించిన విజయం దేశానికి…
టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ చరిత్ర సృష్టించారు… టేబుల్ టెన్నిస్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లి ఇప్పటికే పతకాన్ని ఖాయం చేసుకున్న ఆమె.. ఇవాళ గోల్డ్ మెడల్ కోసం జరిగిన పోరులో పరాజయాన్ని చవిచూసింది.. ప్రపంచ నంబర్ వన్, చైనా క్రీడాకారిణి యింగ్ జావో చేతిలో 0-3 తేడాతో భవీనా ఓటమి పాలయ్యారు.. దీంతో ఆమె రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. కాగా, మొన్న బ్రెజిల్‌కు చెందిన ఓయ్స్ డి ఒలివీరాతో…
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో రజత పతకం దక్కింది.. కుస్తీ వీరుడు రవికుమార్ సిల్వర్ మెడల్ గెలిచాడు.. పురుషుల 57 కిలోల విభాగంలో ఫైనల్‌లో రష్యా రెజ్లర్ చేతిలో ఓటమి పాలయ్యాడు రవికుమార్.. దీంతో.. ఆయన పసిడి పతకంపై పెట్టుకున్న ఆశలు ఆవిరికాగా… రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. రష్యా రెజ్లర్‌తో పోరాడి 4-7తో ఓడిపోయాడు రవికుమార్ దహియా.. ఫైనల్ ఓడినా ఆయనకు రజతం దక్కగా.. ఒలింపిక్స్ చరిత్రలోనే సిల్వర్ గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాడు…