బంగాళాఖాతంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు గల్లంతవడంతో ఆందోళన నెలకొంది. కాకినాడ జిల్లాలో బంగాళాఖాతంలో ఇంజన్ ఆగి నిలిచిపోయిందో బోటు. పర్లోవపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. తమ బోటు భీమునిపట్నం వైపు బోటు కొట్టుకుపోతున్నట్లు సెల్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సందేశం పంపారు మత్స్యకారులు. ఆ తరువాత సెల్ ఫోన్ స్విచ్చాఫ్ అయింది. దీంతో కుటుంబసభ్యులలో ఆందోళన ఏర్పడింది. తమ బోటులో ఇంజన్ ఆగిపోయిందని మత్స్యకారులు సెల్ ఫోన్ ద్వారా సమాచారం పంపారు. సోమవారం నుంచి…
మానవాళికి సవాల్ విసురుతోంది కరోనా మహమ్మారి. కోవిడ్ విరుచుకుపడడంతో తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన వారెందరో. అనాథలందరికీ ప్రభుత్వమే తల్లిదండ్రిగా అన్ని బాధ్యతలు స్వీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అనాథలను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించనుంది. సిగ్నళ్ల వద్ద అనాథలతో భిక్షాటన చేసే వారిని కట్టడి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలకు అండగా సర్కార్ నిలవనుంది. అనాథలకు కేజీ నుంచి…