నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని మూడు రోజులుగా ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) విచారిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. ఢిల్లీలో ఈడీ ఆఫీస్ ముందే కాంగ్రెస్ అగ్రనేతలు నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ ఈడీ విచారణపై తెలంగాణ కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. గురువారం…