బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొణె, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గెహ్రైయాన్’. శకున్ బత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్లో వాయిదా పడడంతో చివరకు ఓటిటీ బాట పట్టింది. వాయ్ కామ్ 18 స్టూడియోస్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.…