మంగళవారం అమెరికా బ్యాట్స్‌మెన్ షాయన్ జహంగీర్ తన సత్తా చూపించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ నేపాల్‌పై కేవలం 79 బంతుల్లో అజేయ సెంచరీ సాధించాడు. అయితే సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీకి సవాల్ విసిరాడు. మ్యాచ్ అనంతరం ఐసీసీతో జరిగిన ఇంటర్వ్యూలో జహంగీర్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీతో ఒక రోజు ఆడటం తన ఏకైక లక్ష్యమన్నారు.