ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల వివాదం ముదురుతోంది. చాలామంది అక్కడ టికెట్ రేట్ల వివాదంపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన సినిమాలన్నీ ఆంధ్రాలో భారీగానే నష్టాలను ఎదురుకోవాల్సి వచ్చింది. దీంతో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు స్వచ్చందంగా థియేటర్లను క్లోజ్ చేసుకున్నారు. మరోవైపు సినిమా పెద్దలు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్ల విషయమై మరోసారి ఆలోచించాలని బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఉలకలేదు పలకలేదు. దీంతో…
ఏపీలో థియేటర్ల రేట్ల విషయమై రచ్చ ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్కడ ఉన్న టికెట్ రేట్లను టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరూ ఒక్కోలా పోల్చుతున్నారు. ఒకరు ఇంతకుముందు భారీగా పెరిగిన టమాటో ధరతో పోలిస్తే, మరొకరు తెలంగాణాలో ఉన్న థియేటర్ పార్కింగ్ ఫీజుతో పోల్చారు. మరోవైపు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఈ రేట్లతో సినిమాలు వేసి నష్టాలూ కొని తెచ్చుకునే కన్నా థియేటర్లు క్లోజ్ చేసుకోవడం మంచిదని భావించి, క్లోజ్ చేశారు కూడా. అక్కడ అఖండ, పుష్ప వంటి…