దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్.. భారత జట్టుపై చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్ల నిషేధం తర్వాత దక్షిణాఫ్రికా జట్టు తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి రావడానికి బీసీసీఐ చేసిన సాయం కాన్రాడ్ అమర్చిపోయాడా? అంటూ ఫైర్ అయ్యారు. రెండు దేశాల మధ్య మంచి క్రికెట్ సంబంధాలు ఉన్నాయని, కాన్రాడ్ అలాంటి పదాలను ఉపయోగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. కాన్రాడ్ క్షమాపణ చెప్పాలని తాను డిమాండ్ చేయడం…