మహిళలపై అత్యాచారాలు వెలుగుచూసిన సమయంలో చాలాసార్లు వాళ్లు ధరించే దుస్తులపై మీడియాలో చర్చలు జరుపడం చూస్తూనే ఉంటాం. ఒకవర్గం మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచిస్తుంటారు… మరోవర్గం వారు ఏది కంఫార్ట్ గా ఉంటే అవే ధరించాలని వాదిస్తూ ఉంటారు. మధ్యేమార్గంగా మరికొందరు మహిళల ఇష్టాలను కాలారాసే శక్తి ఎవరికీ లేదని.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వారికే మంచిదని సూచిస్తూ ఉంటారు. ఇలా ఎవరికీవారు వారికి తోచినవిధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది కేవలం మనదేశానికే పరిమితం కాకుండా…