కేరళకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టైమ్ టేబుల్ సిద్ధమైంది. తిరువనంతపురం-కసర్‌కోట్ వందేభారత్ తిరువనంతపురంలో ఉదయం 5.20 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.25 గంటలకు కాసర్‌కోట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి రాత్రి 10.35 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది.