జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులను ఏరిపారేసేందుకు సెర్చ్ ఆపరేషన్ ను ఇండియన్ ఆర్మీ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా షోపియాన్ జిల్లాలో జరిగిన ఒక సంయుక్త ఆపరేషన్‌లో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.
Jammu and Kashmir: బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో టిఆర్‌ఎఫ్ ఉగ్రవాది హతమయ్యాడు అని అధికారులు వెల్లడించారు. వివరాలలోకి వెళ్తే.. విచక్షణారహితంగా దాడులు చేస్తూ దేశంలో శాంతి భద్రతలను ఆటంక పరిచే ఉగ్రవాదుల పైన ఇండియన్ ఆర్మీ ద్రుష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను ఏరిపారేసేందకు కశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ కలిసి సంయుక్తంగా బుధవారం ఎన్‌కౌంటర్ ని ప్రారంభించారు. ఈ ఆపరేషన్ లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని పోలీసులు తెలిపారు. కాగా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఉగ్రవాదికి..…
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇటీవల కాలంలో కాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదులను సైన్యం, భద్రతాబలగాలు ఏరిపారేస్తున్నాయి.
ఉగ్రవాద కుట్ర కేసులో దక్షిణ కశ్మీర్‌లోని ఐదు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం సోదాలు నిర్వహించింది. ఈ ఏడాది మేలో జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్, షోపియాన్, పుల్వామా, శ్రీనగర్, అనంత్‌నాగ్ జిల్లాల్లోని 13 ప్రాంతాల్లో కూడా ఎన్‌ఐఏ భౌతిక, సైబర్‌స్పేస్ ద్వారా ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నిన కేసులో సోదాలు నిర్వహించింది.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా, షోపియాన్‌లలో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో దర్యాప్తులో భాగంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఈ కేసు పాకిస్థాన్ కమాండర్లు లేదా హ్యాండ్లర్ల ఆదేశానుసారం వివిధ నకిలీ పేర్లతో పనిచేస్తున్న టెర్రర్ గ్రూపులు, టెర్రర్ ఫండింగ్, నేరపూరిత కుట్రకు సంబంధించినది.