దేశంలో కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా ముగిసిపోయింది అనడానికి ఇంతవరకు ఎక్కడ నిర్దారణ కాలేదు. కాకపోతే కేసులు కాస్త తగ్గడంతో సడలింపులు ఇచ్చారు. ఇక బాలీవుడ్ లో షూటింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయిన కొన్ని బడా సినిమాలు అప్పుడే సాహసం చెయ్యట్లేదు. మరికొంత సమయం తీసుకొనేలా కనిపిస్తోంది. అయితే కరోనా నిబంధనలతో ‘గంగూభాయ్ కతియావాడి’ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేశారు. ఈ సినిమా షూటింగ్ తుదిదశలో ఉండగానే.. సెకండ్ వేవ్ అడ్డుతగిలింది. ప్రస్తుత పరిస్థితుల్లో మేకర్స్…
బాహుబలి లాంటి భారీ హిట్ తరువాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తుండగా.. కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇప్పటికే ప్రధాన సన్నివేశాలు అన్ని పూర్తి అవ్వగా.. మిగిలిన షెడ్యూల్ కోసం రీసెంట్ గా షూటింగ్ ప్రారంభించారు. అయితే తాజాగా చరణ్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ముంబైకి చెందిన ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ కూడా, చరణ్ తో పాటు…
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, టాలీవుడ్ హీరో రాంచరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పై క్లారిటీ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావొస్తున్నాయని తెలుస్తోంది. జులై రెండో వారంలో పూజా కార్యక్రమాలు జరుపుకొని, ఆగష్టు మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగనుందని.. దానికి సంబందించిన సెట్స్…