బాహుబలి లాంటి భారీ హిట్ తరువాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తుండగా.. కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇప్పటికే ప్రధాన సన్నివేశాలు అన్ని పూర్తి అవ్వగా.. మిగిలిన షెడ్యూల్ కోసం రీసెంట్ గా షూటింగ్ ప్రారంభించారు. అయితే తాజాగా చరణ్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ముంబైకి చెందిన ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ కూడా, చరణ్ తో పాటు సెట్స్ కి వచ్చాడు. ఈ షెడ్యూల్ లో చరణ్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనుండగా, త్వరలో అలియా భట్ జాయిన్ కానుంది. కాగా రేపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. చరణ్, ఎన్టీఆర్ లపై ఓ సాంగ్ షూట్ చేయనున్నారని సమాచారం. వీలైనంత తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసి కొత్త విడుదల తేదీని ప్రకటించడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.