రానా కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఘాజీ’తో ఉత్తరాది వారికీ పరిచయం అయ్యాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఆ తర్వాత అతను రూపొందించిన ‘అంతరిక్షం’ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహానికి గురిచేసింది. అయితే సంకల్ప్ రెడ్డిలోని ప్రతిభను బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ గుర్తించాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటించడంతో పాటు చిత్ర నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు విద్యుల్ జమ్వాల్. అదే ‘ఐబి 71’. 1971లో జరిగిన ఇండో పాక్ వార్ నేపథ్యంలో ఇంటెలిజెన్ బ్యూర్ పాత్రను తెలియచేసే…
అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప’ ద రైజ్ సినిమా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. భారీ స్థాయి వసూళ్ళతో ప్రదర్శితం అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా మలయాళ వెర్షన్ శనివారం నుంచి ప్రదర్శితం కానుంది. ఈ సినిమా సక్సెస్ పై నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా సెకండ్ పార్ట్ ‘పుష్ప’ ద రూల్ షూటింగ్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరి…
ఒక రోజు తెల్లారేసరికి ఆ ఊరి పొలిమేరల్లో ఓ కారు కనిపిస్తుంది. ఎన్ని రోజులు గడిచినా ఆ కారు ఓనర్ ఎవరో తెలియదు. ఆ ఊరి వారిని సదరు కారు ముప్పుతిప్పలు పెడుతుంటుంది. ఆ కారును ఆశ్రయించి ఉన్న అతీంద్రియ శక్తుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఆ ఊరి వాళ్ళు ఏం చేశారు? ఎన్ని పాట్లు పడ్డారు? వంటి ఆసక్తికర కథ, కథనాలతో రూపొందుతున్న హారర్ ఎంటర్టైనర్ ‘సర్కస్ కార్-2’. నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో రూపొంది…