తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్ కు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం రూ.కోటి 20 లక్షల నజరానా ఇస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. హన్మకొండ స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభంలో మంత్రి వాకిటి శ్రీహరి ఈ ప్రకటన చేశారు. టోక్యోలో జరుగుతున్న డెఫ్లంపిక్స్‌లో హైదరాబాద్‌కు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. పురుషుల విభాగంలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీలో ధనుష్ శ్రీకాంత్ ఈ ఘనత సాధించాడు.…