ఆకుకూరలు తింటే ఆరోగ్యం సిద్ధిస్తుందని అందరూ భావిస్తారు. దీంతో పలువురు వ్యక్తులు కూరగాయలు బదులు ఆకుకూరలు కొనుగోలు చేస్తుంటారు. కానీ కొందరు వ్యాపారులు కక్కుర్తి పడుతూ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ ఆకుకూరల వ్యాపారి చేసిన నిర్వాకం చూస్తే ఎవరికైనా కోపం రాక మానదు. సదరు వ్యాపారి తన వద్ద ఉన్న కొత్తిమీర కట్టలను మురుగు నీటిలో శుభ్రపరిచి విక్రయిస్తున్నాడు. కొంతమంది ఈ తతంగాన్ని వీడియో తీసి భోపాల్ కలెక్టర్‌కు షేర్ చేశారు. దీంతో…