సంక్రాంతి తర్వాత మళ్ళీ బాక్సాఫీస్ బరిలో ఆసక్తికరమైన పోరుకు శివరాత్రి పండగ వేదిక కాబోతోంది. మార్చి 11న శివరాత్రి కానుకగా ఏకంగా 7 సినిమాలు విడుదల కాబోతున్నాయి. గడిచిన రెండు నెలల్లో కొన్ని వారాల్లో తొమ్మిది, పది సినిమాలు విడుదలైనా… ఒకటి రెండు మినహా అందులో మిగిలినవన్నీ చిన్న సినిమాలే ఉండేవి. కానీ రాబోయే శివరాత్రి రోజున మూడు మీడియం బడ్జెట్ చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి. వీటిని ప్రముఖ వ్యక్తులు నిర్మిస్తుండంతో అందరి దృష్టీ…