ఆసక్తికరంగా మారిన శివరాత్రి పోరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి తర్వాత మళ్ళీ బాక్సాఫీస్ బరిలో ఆసక్తికరమైన పోరుకు శివరాత్రి పండగ వేదిక కాబోతోంది. మార్చి 11న శివరాత్రి కానుకగా ఏకంగా 7 సినిమాలు విడుదల కాబోతున్నాయి. గడిచిన రెండు నెలల్లో కొన్ని వారాల్లో తొమ్మిది, పది సినిమాలు విడుదలైనా… ఒకటి రెండు మినహా అందులో మిగిలినవన్నీ చిన్న సినిమాలే ఉండేవి. కానీ రాబోయే శివరాత్రి రోజున మూడు మీడియం బడ్జెట్ చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి. వీటిని ప్రముఖ వ్యక్తులు నిర్మిస్తుండంతో అందరి దృష్టీ ఆ సినిమాలపై పడింది.
శివరాత్రి కానుకగా 11వ తేదీ గురువారం వస్తున్న సినిమాల్లో ప్రధానమైనవి శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’, శ్రీవిష్ణు నటించిన ‘గాలి సంపత్’, నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ‘జాతిరత్నాలు’. ఇందులో ‘శ్రీకారం’ మూవీని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. ఈ బ్యానర్ లో ‘గద్దలకొండ గణేశ్’ తర్వాత వస్తున్న మూవీ ఇదే. ప్రస్తుతం రైతుల జీవితాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పల్లెటూరి నేపథ్యంలో రైతు జీవన విధానంపై వస్తున్న ‘శ్రీకారం’పై పాజిటివ్ బజ్ నెలకొంది. ఇక రెండో సినిమా ‘గాలి సంపత్’లో మాటలు రాని వ్యక్తిగా రాజేంద్ర ప్రసాద్ నటిస్తే… ఆయన్ని ఆటపట్టించే కొడుకుగా శ్రీవిష్ణు నటించాడు. దీనికి అనిల్ రావిపూడి రచన చేయడం మాత్రమే కాదు.. సమర్పకుడిగానూ వ్యహరించాడు. గతంలో అనిల్ రావిపూడి ‘రాజా ది గ్రేట్’లో హీరో రవితేజాను గుడ్డివాడిగా చూపించి కూడా సూపర్ హిట్ ను అందుకున్నాడు. దాంతో ఇందులో రాజేంద్ర ప్రసాద్ పాత్ర సైతం ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుందని అంతా నమ్ముతున్నారు. ఇక ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తెలకు సంబంధించిన స్వప్న సినిమాస్ బ్యానర్ లో ప్రముఖ దర్శకుడు నాగ అశ్విన్ నిర్మించిన సినిమా ‘జాతి రత్నాలు’. నవీన్ పోలిశెట్టి నటించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చక్కని విజయాన్ని అందుకోవడంతో ఈ మూవీ మీద కూడా సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది. చిత్రం ఏమంటే అనిల్ రావిపూడి, నాగ అశ్విన్ లకు నిర్మాతలుగా ఇవి మొదటి సినిమాలు.
Also Read
ఈ మూడు సినిమాలతో పాటే 11వ తేదీ ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’, కన్నడ అనువాద చిత్రం ‘రాబర్ట్’ విడుదల కాబోతున్నాయి. ఇక 12వ తేదీ శుక్రవారం ‘లవ్ లైఫ్ అండ్ పకోడి’, ‘పైసా పరమాత్మ’ సినిమాలు రిలీజ్ అవున్నాయి. మరి ఈ ఏడు సినిమాలలో ఏ యే చిత్రాలు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంటాయో చూడాలి.
తాజావార్తలు
-
Madras High Court: CJP నేత సౌరవ్ దాస్ ఎవరు.? బ్యాక్గ్రౌండ్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
-
Fake Aadhar: నిమిషాల్లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు.. గుట్టురట్టు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు..
-
IND vs NZ 4th T20: టీమిండియా ముందు భారీ లక్ష్యం.. భారత్ గెలిస్తే రికార్డే పో..
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
CM Revanth Reddy: “భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు”.. సుప్రీం తీర్పుపై రేవంత్రెడ్డి హర్షం
ట్రెండింగ్
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!