తెలుగు చిత్రసీమను ఏలిన నృత్య దర్శకుల్లో శివశంకర్ మాస్టర్ శైలి విభిన్నం! శాస్త్రీయ రీతుల్లోనూ, జానపద బాణీల్లోనూ నృత్యభంగిమలు కూర్చి ప్రేక్షకులను రంజింప చేయడంలో మేటిగా నిలిచారు శివశంకర్. ఆయనకు సింగిల్ కార్డులు తక్కువేమీ కాకున్నా, సింగిల్ సాంగ్స్ తోనే పలు మార్లు భళా అనిపించారు. తెలుగునాట శివశంకర్ శిష్యప్రశిష్యులు ఎందరో రాజ్యమేలుతున్నారు. వారితోనూ పోటీపడి నర్తనంలో భళా అనిపించారు మాస్టర్. భావి నృత్యకళాకారులకు శివశంకర్ మాస్టర్ దిశానిర్దేశం చేస్తూ పలు సలహాలు, సూచనలతో అనేక కార్యక్రమాల్లో…
కోవిడ్-19 సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆదివారం (నవంబర్ 28) రాత్రి తుది శ్వాస విడిచారు. శివశంకర్ మాస్టరు చనిపోయే ముందు కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు శివ శంకర్ చికిత్స పొందుతున్న ఏఐజీ హాస్పిటల్స్ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సీనియర్ కొరియోగ్రాఫర్, నటుడి పార్థివ దేహాన్నిఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు చివరి నివాళులర్పించేందుకు హైదరాబాద్, మణికొండలోని పంచవటి కాలనీలోని ఆయన నివాసానికి తీసుకెళ్లనున్నారు. శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం…