National Space Day: భారతదేశం తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నేడు (ఆగస్టు 23) జరుపుకుంటోంది. గత ఏడాది ఇదే రోజున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ని ల్యాండింగ్ చేయడంలో విజయవంతమైంది. జాతీయ అంతరిక్ష దినోత్సవం చంద్రయాన్-3 మిషన్ నుండి విక్రమ్ ల్యాండర్ విజయవంతమైన ల్యాండింగ్ ను సూచిస్తుంది. ఈ ముఖ్యమైన విజయాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం అధికారికంగా ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది.…