లోకనాయకుడు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లాంటి యాక్టింగ్ టాలెంట్ మొత్తాన్ని ఒక దగ్గర చేర్చి లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన సినిమా ‘విక్రమ్’. పాన్ ఇండియా హిట్ గా నిలిచిన ఈ సినిమా రిలీజ్ కి మరో ౭౨ గంటలు ఉంది అనగా, విక్రమ్ సినిమాలో ‘సూర్య’ నటిస్తున్నాడు అంటూ మాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. కోలీవుడ్ సినీ అభిమానులనే కాదు తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులని కూడా ఆశ్చర్యపరిచిన అనౌన్స్మెంట్ ఇది.…