ఈశాన్య చైనాలో శనివారం బస్సు పేలి ఒక వ్యక్తి మరణించగా, 42 మంది గాయపడినట్లు పబ్లిక్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. పేలుడు సంభవించినప్పుడు తమకు పెద్ద శబ్ధం వినిపించిందని, అయితే బస్సులో మంటలు చెలరేగలేదని సాక్షులు తెలిపారు. లియానింగ్ ప్రావిన్స్‌లోని షెన్యాంగ్ నగరంలో జరిగిన పేలుడులో ఒకరు మరణించగా, 42 మంది తీవ్రంగా గాయపపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. మరో 40 మందికి స్వల్ప…