Bangladesh: బంగ్లాదేశ్ జాతీయ భద్రతా సలహాదారు (NSA) ఖలీలూర్ రెహమాన్ ఈరోజు న్యూఢిల్లీలో భారత NSA అజిత్ దోవల్‌ను కలిశారు. షేక్ హసీనాను అప్పగింత వ్యవహారంపై ఇప్పటికే భారత్, బంగ్లాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో ఈ మీటింగ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. రెండు దేశాల మధ్య సంబంధాలు సున్నితంగా మారిన ఈ సమయంలో అజిత్ దోవల్ ఢాకాలో పర్యటించాల్సిందిగా రెహమాన్ ఆహ్వానించారు. కొలంబో భద్రతా కాన్‌క్లేవ్ యొక్క 7వ NSA సమావేశంలో ఇద్దరు నాయకులు సమావేశమయ్యారు.
Sheikh Hasina: బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మాజీ ప్రధాని షేక్ హసీనాపై మానవత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించారని చెబుతూ కేసులు నమోదు చేసింది. గతేడాది జరిగిన విద్యార్థులు హింసాత్మక నిరసనల్లో, షేక్ హసీనా బలవంతంగా ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిందని, బలప్రయోగం ద్వారా పలువురి మరణాలకు కారణమైందని చెబుతూ, బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మరణశిక్షను విధించింది. ఐదు ఆరోపణలపై హసీనాను దోషిగా తేల్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ,హెలికాప్టర్లు, డ్రోన్లు,…