పాకిస్తాన్ దేశం గత కొన్నాళ్ళుగా తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. ఒక్కసారిగా ద్రవ్యోల్బణం రేటు పెరిగిపోవడంతో పాకిస్థాన్ కరెన్సీ విలువ రోజురోజుకు దారుణంగా పడిపోయింది. దీంతో పాకిస్థాన్ లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పాక్ లో లీటరు పెట్రోల్ 253 రూపాయలు.. కాగా డీజిల్ ధర 253.50 పైసలుగా ఉంది. అసలే ధరలు మండిపోతుంటే దాంట్లో మార్జిన్ పెంచాలని పాకిస్థాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్ పట్టుబట్టింది.