Who Is Shashank Singh: ఐపీఎల్ నుంచి మరో టాలెంటడ్ బ్యాటర్ ప్రపంచ క్రికెట్‌కు పరిచయమయ్యాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. ఓడిపోయే మ్యాచ్‌లో చెలరేగి.. తన జట్టుకు విజయం సాధించిపెట్టాడు. అతడు మరెవరో కాదు.. ‘శశాంక్ సింగ్’. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సంచలన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు…