బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. పెళ్లి తరువాత కూడా అమ్మడు స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. ఇకపోతే ప్రస్తుతం దీపికా , షారుఖ్ సరసన పఠాన్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే అమ్మడు హాట్ హాట్ బికినీ ఫొటోలు సెట్ నుంచి లీక్ అవ్వడం .. అవి కాస్తా వైరల్ అవ్వడం తెల్సిందే. ఆ ఫోటోలు లీక్ అవ్వడానికి…
బాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో షారుఖ్ ఖాన్- గౌరీ ఖాన్ జంట ఒకటి. షారుఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న గౌరీ అతడి కష్టాల్లో, నష్టాల్లో.. ఇటీవల కొడుకు విషయంలో భర్తకు సపోర్ట్ గా నిలిచి.. మంచి భార్యకు అర్ధం చెప్పింది. ఇక ఇలా ఉన్నా గౌరీ ఒకానొక సమయంలో షారుఖ్ ని వదిలేద్దామనుకున్నదట. ఇటీవల కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ లో పాల్గొన్న ఆమె, తన లవ్ స్టోరీ ని రివీల్ చేసింది. ” తాము…
గానకోకిల లతా మంగేష్కర్ కరోనాతో పోరాడుతూ కన్నుమూసిన స్నాగతి తెలిసిందే. తమ అభిమాన గాయని అంత్యక్రియలకు అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా తరలివచ్చారు. అయితే లతాజీ అంత్యక్రియల్లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ చేసిన పని ప్రశంసలను, విమర్శలను కూడా అందుకొంటుంది. లతాజీ భౌతికకాయం వద్ద షారుక్ ఉమ్మి వేసి ప్రార్థన చేసి నివాళులు అర్పించారు. దీంతో పలువురు హిందువులు దీన్ని తప్పు పట్టారు. మరికొందరు షారుక్ కి సపోర్ట్ గా నిలుస్తూ ఆయన తనదైన పద్దతిలో…
33 సంవత్సరాల విక్కీ కౌశల్, 38 యేళ్ళ కత్రినా కైఫ్ ను గత యేడాది డిసెంబర్ 9న పెళ్ళి చేసుకున్నాడు. వివాహానంతరం కొంతకాలం వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యమిచ్చిన ఈ బాలీవుడ్ జంట ఇప్పుడు తిరిగి కెరీర్ మీద దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న సినిమాలో విక్కీ కౌశల్ చోటు సంపాదించుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ మూవీలోని కీలక పాత్ర కోసం బాలీవుడ్ లోని…
ప్రస్తుతం దక్షిణాదిలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీప్రసాద్ ఒకరు. తెలుగులో టాప్ హీరోలందరి సినిమాలకు పని చేసి మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు దేవి. తాజాగా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్ కొట్టాడు. ఈ సినిమా తెలుగునాటనే కాదు తమిళ, మలయాళ భాషలతో పాటు హిందీలోనూ ఘన విజయం సాధించింది. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో పలు చిత్రాల్లో దేవి పాటలను ఉపయోగించుకుని హిట్ కొట్టారు. ‘రెడీ’ సినిమాలో దేవి…
షారూఖ్ ఖాన్ నటిస్తున్న ‘పఠాన్’, సల్మాన్ నటించిన ‘టైగర్3’ సినిమాల విడుదల 2023లోనే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సల్మాన్, కత్రినా కైఫ్ నటించిన ‘టైగర్3’లో సీరీస్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించాడు. మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ ఫ్రాంచైజీ 2021లో విడుదల అవుతుందని ప్రకటించారు. అయితే కరోనా వల్ల 2022కి మారింది. ఇప్పుడు ఏకంగా 2023లో రాబోతున్నట్లు వినిపిస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ…
ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న ఎన్సీబీ అధికారి వాఖండే ఆర్యన్ ను కేసు నుంచి తప్పించడానికి భారీగా డబ్బును డిమాండ్ చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను కేసు నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఈ కేసు పలు పలుపులు తిరుగుతోంది. అయితే డబ్బు రికవరీకి సంబంధించి సామ్ డిసౌజా అకా సెన్విల్లే స్టాన్లీ డిసౌజా నేడు ఎంసీబీ సిట్ ముందు హాజరు కానున్నారు. ఆర్యన్…
చీటింగ్ ఆరోపణలపై పూణె సిటీ పోలీసులు అరెస్టు చేసిన కిరణ్ గోసావిని సిటీ కోర్టు నవంబర్ 8 వరకు పోలీసు కస్టడీకి పంపింది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌కు సంబంధించిన డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో కిరణ్ గోసావి సాక్షిగా ఎన్సీబీ పేర్కొంది. ఈ నేపథ్యంలో కిరణ్ గోసావిని విచారణ నిమిత్తం పోలీసులు కస్టడీకి కోరగా సిటీ కోర్టు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ గత నెలలో నిషేధిత…
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు ఊరట కలిగింది. అతడికి బెయిల్ మంజూరు చేస్తూ గురువారం నాడు బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది. 21 రోజులుగా ఆర్యన్ ఖాన్ జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. ఓ స్టార్ హీరో తనయుడు ఇన్నిరోజుల పాటు జైలులో ఉండటం అటు బాలీవుడ్ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో కొన్నిరోజులుగా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కాగానే…
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగానే ఈరోజు ఉదయం ఎన్సీబీ నటుడు చుంకీ పాండే కుమార్తె, బాలీవుడ్ నటి అనన్య పాండే ఇంట్లో, షారుఖ్ ఖాన్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. తరువాత అనన్య పాండేను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది ఎన్సీబీ. సాయంత్రం 4 గంటల సమయంలో ఏజెన్సీ కార్యాలయానికి చేరుకున్న అనన్య పాండేను ఇప్పుడు ఎన్‌సిబి ప్రశ్నిస్తోంది. కొన్ని…