స్టాక్ మార్కెట్ వరుసగా ఆరో రోజు క్షీణిస్తోంది. ఈ క్షీణతతో అదానీ గ్రూప్ షేర్లు కూడా దెబ్బతిన్నాయి. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా పతనావస్థలో ఉంది. సెన్సెక్స్, నిఫ్టీలలో అదానీ పోర్ట్స్ 4.11 శాతం పడిపోయి టాప్ లూజర్‌గా ఉంది. అదానీ టోటల్ గ్యాస్ 2.94% తగ్గింది. అదానీ గ్రీన్ ఎనర్జీ 2.96 శాతం పడిపోయింది.
ఎన్నికల చివరి దశకు ముందు అమ్మకాల ఒత్తిడి మధ్య భారత బెంచ్ మార్క్ సూచీలు బుధవారం ట్రేడింగ్ సెషన్ లో భారీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ 183 పాయింట్లు నష్టపోయి 22,704.7 వద్ద ముగియగా, బిఎస్‌ఇ సెన్సెక్స్ 667 పాయింట్లు నష్టపోయి 74,502.90 వద్ద స్థిరపడింది. నేటి మార్కెట్ లో.. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 250, నిఫ్టీ మైక్రోక్యాప్ 250 మినహా అన్ని సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని…