Hyderabad Metro: విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరంలో మరిన్ని అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నగరంలో ఇప్పటికే కొత్త ఫ్లై ఓవర్లు, వంతెనలు, రోడ్లు నిర్మించారు.
Shamshabad Metro works: ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులను వేగవంతం చేయడానికి సమాంతరంగా అనేక ముందస్తు నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయని, అవి శరవేగంగా సాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. జనరల్ కన్సల్టెంట్ (జిసి) కోసం బిడ్‌ల సమర్పణకు ఈ నెల 20 చివరి తేదీ కాగా, ఈ నిపుణులైన ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు వచ్చే నెల మొదటి వారంలో నియమితులవనున్నారు.