ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ‘శంబాల’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన నేపథ్యంలో, చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు అగ్ర నిర్మాత అల్లు అరవింద్, దర్శకులు బాబీ, వశిష్ట మరియు హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ఆదికి సక్సెస్ రావడం నా కుటుంబ సభ్యుడు గెలిచినంత ఆనందంగా ఉంది. సాయి కుమార్ కుటుంబంతో మాకు మూడు తరాల…