Shakeela: శృంగార తార షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఆమె నటించిన సినిమాలు.. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి. ఆమె బయోపిక్ కూడా అభిమానుల ముందుకు కూడా వచ్చింది. ఇక ఆమె జీవితం అందరికీ తెరిచిన పుస్తకమే అని తెలుసు.. కానీ, అందులో కూడా చాలా రహస్యాలు ఉన్నాయని.. ఆమె నిత్యం ఏదో ఒక విషయాన్ని బయటపెడుతూనే ఉంటుంది.