వచ్చే వారం వివిధ భాషలకు చెందిన, మూడు విభిన్న కథా చిత్రాలు వెండితెరపై వెలుగులు విరజిమ్మబోతున్నాయి. ఇళయ దళపతి విజయ్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘బీస్ట్’ ఏప్రిల్ 13న అంటే బుధవారం రాబోతోంది. ఆ రోజుకో ప్రత్యేకత ఉంది. ఏప్రిల్ 15 గుడ్ ఫ్రైడే. దానికి ముందు వచ్చే బుధవారాన్ని క్రైస్తవులు ‘హోలీ వెడ్ నెస్’ గా భావిస్తారు. అందుకే తన ‘బీస్ట్’ చిత్రాన్ని శుక్రవారానికి రెండు రోజుల ముందే ప్రపంచవ్యాప్తంగా విజయ్ విడుదల చేయబోతున్నాడు.…