లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణ పోలీస్ కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. జూన్ 10 వరకు పొడిగిస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌లో లైంగిక వేధింపుల వీడియోలు బయటకు రాగానే ప్రజ్వల్ జర్మనీకి పారిపోయారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రజ్వల్ రేవణ్ణ కేసులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో శుక్రవారం ప్రజల్వ్ తల్లికి దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసింది. విచారణకు అందుబాటులో ఉండాలని కోరింది.