లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణ పోలీస్ కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. జూన్ 10 వరకు పొడిగిస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌లో లైంగిక వేధింపుల వీడియోలు బయటకు రాగానే ప్రజ్వల్ జర్మనీకి పారిపోయారు. అనంతరం మే 31న తిరిగి ప్రజ్వల్ ఇండియాకు వచ్చాడు. ఎయిర్‌పోర్టులో దిగగానే సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. కోర్టు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. గురువారం కస్డడీ ముగియడంతో కోర్టులో హాజరుపరచగా.. జూన్ 10 వరకు పొడిగించింది.
ఇది కూడా చదవండి: Lok Sabha: తెలుగు రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళలు వీరే..
ఇదిలా ఉంటే తాజాగా వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రజ్వల్ రేవణ్ణ ఓడిపోయారు. జేడీఎస్-బీజేపీ పొత్తులో భాగంగా హాసన్ సీటును తిరిగి ప్రజ్వల్‌కే ఇచ్చారు. అయితే ఇక్కడ 42 వేలకు పైగా ఓట్లతో ఓటమి పాలయ్యారు.
ఇది కూడా చదవండి: Kalpana soren: బైపోల్స్‌లో విక్టరీ.. మెజార్టీ ఎంతంటే..!