పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో భద్రతా బలగాలపై జరిగిన రెండు వేర్వేరు ఉగ్రవాదుల దాడుల్లో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ మేరకు ఆదివారం అధికారులు సమాచారం అందించారు. మొదటి దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది మరణించారని, ఇద్దరు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలోని హసన్ ఖేల్ ప్రాంతంలో శనివారం బాంబు నిర్వీర్య యూనిట్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరిగిందని పాకిస్థాన్ భద్రతా అధికారులు…