ఇప్పటికే పలు సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్ విక్రయించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇవాళ జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేయనుంది.. ఈ రోజు ఆన్‌లైన్‌లో జనవరి నెల కోటాకు సంబంధించిన దర్శన టికెట్లతో పాటు పలు ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నారు.
టీటీడీ బోర్డు గురువారం నాడు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో గత కొంతకాలంగా నిలిచిపోయిన ఆర్జిత సేవలను పునరుద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది. అంతేకాకుండా సిఫార్సు లేఖలపై ఆర్జిత సేవా టికెట్ల ధరలను భారీగా పెంచాలని నిర్ణయం తీసుకుంది. సుప్రభాత సేవకు రూ.2 వేలు, తోమాల, అర్చన సేవలకు రూ.5వేలు, వేద ఆశీర్వచనానికి రూ.10 వేలు, కళ్యాణోత్సవానికి రూ.2,500, వస్త్రాలంకరణ సేవా టికెట్ ధరను రూ.లక్షకు పెంచాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఆనంద నిలయానికి బంగారు తాపడ…