23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత, అమెరికా లెజెండ్ సెరెనా విలియమ్స్ మంగళవారం టెన్నిస్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించింది. క్రీడల నుంచి తాను దూరమవుతున్నానని పేర్కొంది. టెన్నిస్ నుంచి తప్పుకోవడానికి సిద్ధమేనని ఆమె రాసిన ఓ వ్యాసాన్ని వోగ్ మేగజైన్ విడుదల చేసింది.