మేషం: భాగస్వామ్యుల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ పెద్దల మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ఇతరులను అతిగా విశ్వసించడం వల్ల నష్టపోయే ప్రమాదం వుంది. జాగ్రత్త వహించండి. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వృషభం : అసలైన మీ లక్ష్యాలను చేరుకోవాలంటే పనిపై అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఆహ్వానాలు లభిస్తాయి.…