సెప్టెంబర్ 10 శుక్రవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం: భాగస్వామ్యుల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ పెద్దల మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ఇతరులను అతిగా విశ్వసించడం వల్ల నష్టపోయే ప్రమాదం వుంది. జాగ్రత్త వహించండి. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
వృషభం : అసలైన మీ లక్ష్యాలను చేరుకోవాలంటే పనిపై అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఆహ్వానాలు లభిస్తాయి. మీరు అభిమానించే వ్యక్తి నుంచి ప్రశంసలు పొందుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి.
Also Read
- Astrology: సెప్టెంబర్ 14 సోమవారం దినఫలాలు.. వినాయక చవితి రోజు ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..!
- Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
- Astrology: సెప్టెంబర్ 12 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్న్యూస్..!
- Astrology: సెప్టెంబర్ 11 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికే డబ్బులే డబ్బులు..!
మిథునం: ఉపాధ్యాయులకు రిప్రజెంటేటివ్‌లకు సదవకాశాలు లభిస్తాయి. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. చేజారిన అవకాశాలు సైతం తిరిగి దక్కించుకుంటారు. ప్రయాణాలు అనుకూలం. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. వైద్యులకు చికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో అవసరం.
కర్కాటకం: ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్ట్, కంప్యూటర్ రంగాల్లో వారికి సామాన్యంగా ఉండగలదు. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో మెళకువ అవసరం. అనుకున్న పనులు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఓర్పు, నేర్పుతో ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు.
సింహం: సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ అవసరాలకు ధనం సమకూరుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఉద్యోగ యత్నాలు అనుకూలం. చిరకాలపు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం వుంది. సంఘంలో కీర్తి గౌరవాలు ఇనుమడిస్తాయి. కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు కలిసిరాగలదు.
కన్య: వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. మీ ప్రతిభ వెలుగులోనికి వస్తుంది. ఒకేసారి అనేక పనులు మీద పడటంతో అసహనానికి గురవుతారు. స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగంలో వారికి సదవకాశాలు లభిస్తాయి. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి.
తుల: ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ప్రైవేట్ సంస్థల్లో వారికి ఒత్తిడి, చికాకు తప్పదు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. వ్యాపారులకు పోటీ పెరగడంతో ఆశించినంత పురోభివృద్ధి వుండదు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు సదవకాశాలు లభిస్తాయి.
వృశ్చికం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం లభిస్తుంది. మీ ఆలోచనలు, ప్రణాళికలు గోప్యంగా వుంచడం మంచిది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకండి. జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా సంయమనంతో వ్యవహరించాల్సి వుంటుంది.
ధనస్సు: కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి వుండదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది.
మకరం: బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఏ వ్యక్తికీ పూర్తి బాధ్యతలు అప్పగించడం మంచిది కాదని గమనించండి. పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా వుంటుంది. ఉద్యోగులకు పనిభారం అధికం. పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
కుంభం: మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. బంధుమిత్రులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు తరుచు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు.
మీనం: ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతల వల్ల చికాకులు, పనిభారం తప్పవు. మీ పట్ల ముభావంగా వుండే వ్యక్తులు మీకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో, చెల్లింపుల్లో అప్రమత్తత చాలా అవసరం. మీ హోదాకు తగినట్లుగా ధన వ్యయం చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు సుఖవంతంగా సాగుతాయి.
తాజావార్తలు
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్‌ప్లే
-
Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!