బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ గ్రహీత ఆర్థికవేత్త డాక్టర్ ముహమ్మద్ యూనస్‌కు న్యాయస్థానం సోమవారం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. యూనస్ మద్దతుదారులు ఈ సంఘటనను "రాజకీయ ప్రేరణ"గా అభివర్ణించారు. ఇదిలా ఉంటే.. 83 ఏళ్ల ఆర్థికవేత్త ముహమ్మద్ యూనస్ తన పేదరిక వ్యతిరేక ప్రచారానికి 2006లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. ఈ ప్రచారం బంగ్లాదేశ్‌కు 1983లో స్థాపించిన గ్రామీణ బ్యాంకు ద్వారా మైక్రోక్రెడిట్‌కు నిలయంగా పేరు తెచ్చుకుంది.
చేతులు కాలాకా.. ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది ఇస్లామాబాద్ హైకోర్టు చెప్పే విషయం. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు విధించిన శిక్షలో పొరపాటు జరిగిందని ఇప్పుడు ప్రకటించింది