చూడగానే ముద్దుగా బొద్దుగా ఉంటూ మురిపించి, మైమరిపించారు రజనీ అందం. ఆమె ముద్దుమోముకు తగ్గ నవ్వులు నాట్యం చేసేవి. చిత్రసీమలో ‘నవ్వుల రజనీ’గానే పిలిచేవారు. 1985 ప్రాంతంలో తెలుగువారి ముందు నిలచిన రజనీ అందం, చందం నాటి రసికులకు బంధం వేశాయి. వచ్చీ రాగానే రజనీ బాగా పరిచయమున్న అమ్మాయిలా ఆకట్టుకున్నారు. ఇక ఆమె చలాకీ నటన మరింతగా జనాన్ని కట్టిపడేసింది. అప్పటి టాప్ హీరోస్ లో చిరంజీవి మినహాయిస్తే, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ అందరి సరసనా…