(ఆగస్టు 20న పద్మనాభం జయంతి) తెలుగు సినిమా నవ్వుల తోటలో పద్మనాభం ఓ ప్రత్యేకమైన పువ్వు. నవ్వు నాలుగందాల చేటు అంటారు కానీ, పద్మనాభం నవ్వును నాలుగు వందల విధాలా గ్రేటు అనిపించారు. ఆయన నటించిన వందలాది చిత్రాలను పరిశీలిస్తే, ఒక్కో సినిమాలో ఒక్కోలా నవ్వుతూ అలరించారు. ఆయన నవ్వులను అనుకరిస్తూ ఆ రోజుల్లో కుర్రకారు తమ చుట్టూ ఉన్నవారికి కితకితలు పెట్టేవారు. కేవలం హాస్యనటునిగానే కాదు, నిర్మాతగా, దర్శకునిగానూ పద్మనాభం సాగారు. ఆయన సొంత నిర్మాణ…